సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఆడరానిమా టది
టైటిల్: ఆడరానిమా టది
పల్లవి:
ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే // పల్లవి //
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే // ఆడ //
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ -
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే // ఆడ //
పరిపరివిధములఁ బలుకులు గులుకఁగ
అరమరచి చొక్కిన దది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే // ఆడ //