సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఆది మునుల సిద్ధాంజనము
పల్లవి:

ఆది మునుల సిద్ధాంజనము
యేదెస చూచిన నిదివో వీడే

చరణం:

నగినసెలవిఁ బడు నాలుగుజగముల
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే

చరణం:

కనుదెరచిన నలుగడ నమృతములటు
అనువున గురిసీ నపారము
వనితలు నంద వ్రజమున జెలగగ
మనికిక నిరవై మలసీ వీడే

చరణం:

పరమునకును దా బరమై వెలసిన
పరిపూర్ణ పరాత్పరుడు
సరస రుక్మిణికి సత్య భమకును
వరుడగు వేంకట వరదుడే వీడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం