సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఆర్తుఁడ నేను నీకడ్డ
పల్లవి:

ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు
మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే // పల్లవి //

చరణం:

సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు
సర్వసర్వంసహాచక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే // ఆర్తు //

చరణం:

పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుఁడ నన్ను సరిఁ గావవే // ఆర్తు //

చరణం:

అణువులోపలినీవు ఆదిమహత్తును నీవు
ప్రణుతశ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు // ఆర్తు //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం