సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అభయదాయకుడ
పల్లవి:

అభయదాయకుడ వదె నీవేగతి
ఇభరక్షక నన్నిపుడు కావవే // పల్లవి //

చరణం:

భయహారదైత్యేయ భంజనకేశవ
జయజయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింకలుడుపవే // అభయదాయకుడ //

చరణం:

బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్షక
కంధర వర్ణుడ గతి నీనామమె
అంధకారముల నణచి మనుపవే // అభయదాయకుడ //

చరణం:

దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నా విన్నపమిదియే // అభయదాయకుడ //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం