సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అద్దో యెక్కడిసుద్ది
పల్లవి:

అద్దో యెక్కడిసుద్ది అంతేసి కోపఁగలనా
గద్దించ నీతో నాకుఁ బెద్దరికమా

చరణం:

చెలఁగి నీవేమి చేసినాఁ జేసితివి గాక
చలములు సాదించ సరిదాననా
సెలవుల నవ్వేవు నీ చిత్తము కొలఁది గాక
మలసి నే మారునవ్వ మందెమేళమా

చరణం:

కొచ్చి కొచ్చి నీ వెంత కొంగువట్టి తీసినాను
పచ్చిదేరఁ బెనఁగ కోపపుదాననా
యెచ్చరించి సారె సారె నిక్కువ లంటేవు నీవు
గచ్చుల నేనూ నొరయఁ గండ గర్వమా

చరణం:

యిక్కువ శ్రీవేంకటేశ యేలితివివంటా నేను
నిక్కి యెమ్మె సేయ నీతో నీటుదాననా
మక్కువచేసి నన్ను మన్నించితివి రతుల
అక్కరతోఁ గొసరఁగ ఆసోదమా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం