సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అదె చూడరయ్యా పెద్దహనుమంతుని గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా
టైటిల్: అదె చూడరయ్యా పెద్దహనుమంతుని గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా
పల్లవి:
అదె చూడరయ్యా పెద్దహనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా
వుదయాస్తశైలములు వొకజంగగాఁ జాఁచె
అదివో ధ్రువమండలమందె శిరసు
చదివె సూర్యునివెంట సారె మొగము ద్రిప్పుచు
యెదుట నీతనిమహిమ మేమని చెప్పేమయ్యా
దండిగా బ్రహ్మాండముదాఁక దోఁక మీఁదికెత్తె
మెండగు దిక్కులు నిండ మేను వెంచెను
గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె
అండనీతని ప్రతాప మరుదరుదయ్యా
దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె
పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీవేంకటేశు హితవరిబంటాయ
మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా