సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అదె లంక సాధించె
పల్లవి:

అదె లంక సాధించె నవనిభారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితఁడు

చరణం:

రవివంశతిలకుఁడు రాముఁ డితఁడు
భువిఁ బుట్టె దశరథ పుత్రుఁ డితఁడు
భవుఁడెంచెఁ దారకబ్రహ్మ మీతఁడు
పవనజుకిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు

చరణం:

బలువుఁడు సీతాపతి యితఁడు
తలకొన్న వాలిమర్దనుఁ డితఁడు
విలసిల్లె నేకాంగవీరుఁ డితఁడు
చలమరి కోదండదీక్షాగురుఁ డితఁడు

చరణం:

శరణాగత వజ్రపంజరుఁ డితఁడు
సరిలేని యసురభంజకుఁ డితఁడు
వరదుఁడు శ్రీవేంకటేశ్వరుఁ డితఁడు
అరయ విజయనగరాధీశుఁ డితఁడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం