సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అదె శిరశ్చక్రములేనట్టిదేవర
పల్లవి:

అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు
యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో // పల్లవి //

చరణం:

"అనాయుధాసో అసురా అదేవా" యని
వినోదముగ ఋగ్వేదముదెలిపెడి
సనాతనము విష్ణుచక్రధారునకును
అనాది ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //

చరణం:

"యచ్చ యింద్రే" యని "యచ్చ సూర్యే" యని
అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి
ముచ్చట గోవిందుని ముద్రధారణకు
అచ్చమయిన ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //

చరణం:

మును "నేమినా తప్త ముద్రాం ధారయే" త్తని
వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని
మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు
అనువుగ బ్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం