సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అదె వచ్చె చెలియ యొయారమ్ముతో
పల్లవి:

అదె వచ్చె చెలియ యొయారమ్ముతో ప్రియుని
సదనంబు వెడలి తన సఖులు గనకుండా

చరణం:

నుదుటి కస్తురి చెమట పదనై జారుచీర
నదిమి వీడిన తురుము కుదురుపరచి
వొదిగొదిగి తనకెవ్వరెదురౌదురో యంటా
పెదవిగంటీ మడుపు తుద మాటుకొంటా

చరణం:

నునుగుబ్బకన గోటికొన జీర మరుగుబడ
పెనుకెంపు బన్నసరు లనువుబరచి
తనకింద ఁదళుకు కన్నుల నిదుర సొలయగా
వనజము మూర్కొని వూర్పుబడి నణచుకొంటా

చరణం:

అల తత్తరబడుచు అవ్వల నివ్వల గట్టు
చలువశాలకలువలు సడలగా
అల శ్రీవేంకటరాయని కూడిన సరసపు
కలయిక మది తలచుకొంటా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం