సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అదె వచ్చె నిదె
పల్లవి:

అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు // పల్లవి //

చరణం:

గరుడధ్వజం బిదె ఘనశంఖరవ మదె
సరుసనే విష్ణుదేవుచక్ర మదె
మురవైరిపంపు లవె ముందరిసేన లవె
పరచి గగ్గుల కాడై పారరో దానవుల // అదె వచ్చె //

చరణం:

తెల్లవి గొడుగు లవె దేవదుందుభులు నవె
యెల్లదేవతలరథా లింతటా నవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపుపాతాళాన బడరో దనుజులు // అదె వచ్చె //

చరణం:

వెండిపైడిగుదె లవె వెంజామరము లవె
మెండగుకై వారాలు మించిన వవె
దండి శ్రీవేంకటపై దాడిముటై నదె యిదె
బడుబండై జజ్జరించి పారరోదై తేయులు // అదె వచ్చె //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం