సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అదియెపో శ్రీహరినామము
టైటిల్: అదియెపో శ్రీహరినామము
పల్లవి:
అదియెపో శ్రీహరినామము
తుదిపద మిదియె ధృవమై కలిగె
తొడరి చిత్రకేతుఁ డే నామము
తడవి లోకమంతయు గెలిచె
విడువక బ్రహ్మయు వెస నే నామము
బడిబడి నుడుగుచు ప్రభుఁడై నిలిచె
హరుఁ డేనామము అదె తారకముగ
నిరతిఁ దడవి యెన్నిక మీఱె
ధర నేనామము దలఁచి నారదుఁడు
సురమునియై సంస్తుతులకు నెక్కె
ధృవుఁ డేనామము దొరకొని నుతియించి
ధృవపట్టంబున తుద బ్రదికె
జవళి శ్రీవేంకటేశ్వరుదాసు లెల్లాను
భువి నేనామము భోగించి మనిరి