సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అదుగో కొలువై యున్నాడు
టైటిల్: అదుగో కొలువై యున్నాడు
పల్లవి:
అదుగో కొలువై యున్నాడు - అలమేలుమంగపతి
పదివేల విధములను పారుపత్తెము జేయుచు
రంగమండపములో - రత్నసింహాసనముపై
అంగనామణులతో - అమర వేంచేసి
బంగారు పావడలు - పసరించి యిరుగడల
శృంగారముగ సురలు - సేవ శేయగను
వెండిబైడి గుదియలను - వేత్రహస్తులు పొగడ
నిండు వెన్నెలపూల - దండ లమర
హుండిగను కానుకల - నొనర లక్కలు జేయ
దండి మీఱగ నిపుడు - దేవరాయడు చెలగి
అంగరంగ వైభవముల - రంగుగా చేకొనుచు
మంగళహారతుల - మహిమవెలసి
శృంగారమైనట్టి మా శ్రీవేంకటాధిపు
డంగనలు కొలువగా నిపుడు వేంచేసి