సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అహో నమో నమో
పల్లవి:

అహో నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి // పల్లవి //

చరణం:

లోకాలోకములు లోన నించుకొన్న నీవు
ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి // అహో నమో //

చరణం:

అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞ భోక్తవైన నీవు
అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి // అహో నమో //

చరణం:

దేవతలచే పూజ తివిరి గొనిన నీవు
ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు
ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి // అహో నమో //

అర్థాలు



వివరణ