సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అహోబలేశ్వరుడు అఖిల
పల్లవి:

అహోబలేశ్వరుడు అఖిల వందితుడు
మహి నితని గొలిచి మనుడిక జనులు // పల్లవి //

చరణం:

మూడు మూర్తులకు మూలంబీతడు
వేడి ప్రతాపపు విభుడీతడు
వాడి చక్రాయుధ వరదుండీతడు
పోణిమి పురాణ పురుషు డీతడు // అహోబలేశ్వరుడు //

చరణం:

అసురలకెల్ల కాలాంతకు డీతడు
వసుధ దివ్యసింహం బితడు
విసువని ఏకాంగ వీరుడీతడు
దెసల పరాత్పరతేజం బితడు // అహోబలేశ్వరుడు //

చరణం:

నిగిడి శ్రీవేంకట నిలయుడీతడు
బగివాయని శ్రీపతి యీతడు
సొగసి దాసులకు సులభు డీతడు
తగు ఇహపరముల దాతయు నీతడు // అహోబలేశ్వరుడు //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం