సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అహోబలేశ్వరుడు అరికులదమనుడు
పల్లవి:

అహోబలేశ్వరుడు అరికులదమనుడు
మహా మహిమలకు మలసీవాడె // పల్లవి //

చరణం:

కదలు కన్నులును కరాళవదనము
గుదిగొను భయదపు కోరలను
అదరు మీసములు అలరగ నవ్వుచు
వుదుట తోడ కొలువున్నాడు వాడె // అహోబలేశ్వరుడు //

చరణం:

అతిసిత నఖములు అనంత భుజములు
వితత పరాక్రము వేషమును
అతుల దీర్ఘజిహ్వయు కడు మెరయగ
మితిలేని కరుణ మెరసీ వాడు // అహోబలేశ్వరుడు //

చరణం:

సందడి సౌమ్యములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడగను
ఇందిర దొడపై నిడి శ్రీవేంకట
మందు నిందు కడు అలరీ వాడే // అహోబలేశ్వరుడు //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం