సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అలివేణినిఁ బెండ్లాడవయా
పల్లవి:

అలివేణినిఁ బెండ్లాడవయా
చెలులవిన్నపము చేకొనవయ్యా

చరణం:

సొలపులఁ దొలితొలి చూచినచూపులు
కొలఁదిమీర నుంకువలాయ
చెలఁగి చేతులను సేసినసన్నలు
తలఁపఁగ నలుగడఁ దలఁబాలాయ

చరణం:

ననుపున సెలవుల నవ్విననవ్వులు
గొనకొనఁగఁ బాలకూళ్ళాయ
అనువుగ ప్రియమున నాడినమాటలు
మనసిజతంత్రపుమంత్రములాయ

చరణం:

వేడుకకాఁగిటివినయపుసేఁతలు
కూడినకూటపుగురులాయ
యీడనె శ్రీవేంకటేశ యేలితివి
తోడలమేల్మంగ దోమట్లాయ

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం