సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అల్లదె జవ్వని
పల్లవి:

అల్లదె జవ్వని హరి యురమున నదె
మెల్లనె యిటు వుపమించరే మీరు ||

చరణం:

మత్తెపు జిప్పలో ముంచిన కలువలో
వొత్తిలి కనుగవ లొక మాటాడరే
గుత్తపు గుండలో కొండలో కుచములో
హత్తి యేర్పడగ ననరే మీరు ||

చరణం:

తామెర తూండ్లో తతియగు తీగెలో
భామ చేతు లేర్పరచరే యిపుడు
దోమటి సింహమో తొడ గిన బయలో
ఆమాటాడరే అందులో నొకటి ||

చరణం:

నీలపు మణులో నిండిన మేఘమో
బలకి తురు మొక పలుకున జెప్పరే
యీ లీల శ్రీవేంకటేశ్వరు గూడెను
మేలిమి మెఅగో మెలుతో యనరే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం