సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అల్లదె నీ రమణి ఆయిత్తమై
టైటిల్: అల్లదె నీ రమణి ఆయిత్తమై
పల్లవి:
అల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది
పెల్లుగ జాజరాడఁ బిలిచీఁ బోవయ్యా
వనితచూపులు కలువలవసంతములు
ఘన మైనమోహము గంధము వసంతము
మనసులో కోరికలు మంచినీళ్ల వసంతము
పెనఁగి జాజరలాడఁ బిలిచీ నయ్యా
కలికినవ్వులు నీకు కప్పురవసంతము
నిలిచినకళలు వెన్నెలవసంతములు
పలుకులకొసరులు బంగారువసంతము
బెళకక జాజరాడఁ బిలిచీ నయ్యా
కేలు వట్టి తీసినది కెందామరవసంతము
చాలుఁ బులకలు ముత్యాలవసంతము
యీలాగుల శ్రీవేంకటేశ ఆకెఁ గూడితివి
పేలరి యై జాజరాడఁ బిలిచీఁ బోవయ్యా