సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా
పల్లవి:

అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా
అల్లుకొంటి విని చెలుల నధోక్షజా

చరణం:

అందు నిందు నీ యిర వధోక్షజా
అందాలు చెప్ప వచ్చే వధోక్షజా
అందరు నెఱుఁగుదురు యధోక్షజా మాకు
నందుకొని బా సిచ్చే వధోక్షజా

చరణం:

అంగడి మొక్కువారమా అధోక్షజా నీకే
యంగము యీ నడవడి యధోక్షజా
అంగజముద్రలు నించే వధోక్షజా నీ
యంగనలు గాదనేరా యధోక్షజా

చరణం:

అనరాదు గాక నిన్ను నధోక్షజా కడు
ననుకాయెఁ బ్రియములు అధోక్షజా
అనుఁగు శ్రీవేంకటాద్రి యధోక్షజా మమ్ము
ననిశముఁ గూడితివి యధోక్షజా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం