సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అలమేలుమంగ నీయభినవరూపము
పల్లవి:

అలమేలుమంగ నీయభినవరూపము
జలజాక్షుకన్నులకు చవులిచ్చేవమ్మా

చరణం:

గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
పరమానందసంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించఁగఁ జేసితి గదమ్మా

చరణం:

శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీఁద వెదచల్లుచు
రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ-
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

చరణం:

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతివమ్మా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం