సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
పల్లవి:

అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
చెలరేఁగి కందువలు చిత్తగించవయ్యా

చరణం:

తరుణిదేహమే నీకు తగుదివ్యరథము
గరుడధ్వజంబాపె కప్పుపయ్యద
తురగములు రతులఁ దోలెడు కోరికెలు
సరినెక్కి వలపులు జయించవయ్యా

చరణం:

దిండు కలపిఱుఁదులు తేరు బండికండ్లు
అండనే పువ్వులగుత్తులాపెచన్నులు
కొండవంటి శృంగారము కోపునఁగల సొబగు
నిండుకొని దిక్కులెల్లా నీవేగెలువవయ్యా

చరణం:

వెలఁదికంఠము నీకు విజయశంఖమదిగో
నిలువెల్ల సాధనాలు నీకునాపె
యెలమి శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
పలుజయముల నిట్టే పరగవయ్యా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం