సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
పల్లవి:

అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
నిలుచుండి నన్నుఁ జూచి నీకేల లోఁగను

చరణం:

చేరి విన్నవించవే సిగ్గువడ నీకేఁటికి
చీరుమూరుగా వలచినదానవు
వేరులే కప్పటనుండి వేళగాచుకుందానవు
నేరుపుతో నన్నుఁ జూచి నీవేల లోఁగేవు

చరణం:

గట్టిగాను నవ్వవే కడుదాఁచనేఁటికి
తొట్టినట్టితమకముతోడిదానవు
నట్టున నందుకుఁగానే కోరి లాచి(జాచి ?) వుందానవు
నెట్టన నేనుండఁగాను నీవేల లోఁగేవు

చరణం:

యెనసి కాఁగిలించవేఁ యేఁకరఁగ నీకేఁటికి
పనివడి యట్టె యాసపడదానవు
మునుపె నన్నుఁ గూడె నిమ్ముల శ్రీవేంకటేశుఁడు
నిను నాతఁడే కూడి నీవేల లోఁగేవు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం