సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలర నుతించరో హరిని
టైటిల్: అలర నుతించరో హరిని
పల్లవి:
అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనీ గాలము // పల్లవి //
సేయరో మనుజులారా చింత హరి నికనైన
రోయరో మీ భుజియించు రుచుల మీద
కాయమస్థిరము యీకవి యధృవము చాల
బోయబో యెందుకు గాకపోయ గాలము // అలర //
మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరిక లెల్లను మీకు
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము // అలర //
కనరో వేంకటపతి గన్నులు దనియగా
వినరో యీతని స్తుతు వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీది మదిబుద్ది దాచీనీ గాలము // అలర //
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం