సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలరులు గురియగ నాడెనదే
పల్లవి:

అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ // పల్లవి //

చరణం:

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ // అలరులు //

చరణం:

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ // అలరులు //

చరణం:

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ // అలరులు //

అర్థాలు



వివరణ