సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలుగకువమ్మ నీ వాతనితో
పల్లవి:

అలుగకువమ్మ నీ వాతనితో నెన్నఁడును
పలువేడుకలతోనె పాయకుండరమ్మా // పల్లవి //

చరణం:

జలధిఁ దపము సేసె సాధించెఁ బాతాళము
నెలఁత నీరమణుఁడు నీకుఁగానె
యిలవెల్లా హారించె నెనసెఁ గొండగుహల
యెలమి నిన్నిటాను నీకితవుగానె // అలు //

చరణం:

బాలబొమ్మచారై యుండెపగలెల్లా సాధించె
నీలీలలు దలఁచి నీకుఁగానె
తాలిమి వ్రతమువట్టి ధర్మముతోఁ గూ డుండె
పాలించి నీవుచెప్పిన పనికిఁగానె // అలు //

చరణం:

యెగ్గు సిగ్గుఁ జూడఁడాయె యెక్కెనుశిలాతలము
నిగ్గుల నన్నిటా మించె నీకుఁగానె
అగ్గలపు శ్రీవేంకటాద్రీశుఁడై నిలిచె
వొగ్గి నిన్నురాన మోచివుండుటకుఁగానె // అలు //

చరణం:

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం