సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలుక లేటికి రావే
పల్లవి:

అలుక లేటికి రావే యాతనివద్దకి నీవు
బలిమైతే వలపులు పదనుకు వచ్చునా // పల్లవి //

చరణం:

సంగడి నున్న సతికి చనవులు గలుగుగాక
కంగి కడనుండితేను కలదా పొందు
చెంగటనున్న రుచులు చేరి నోరూరించుగాక
అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా // అలుక //

చరణం:

వినయపుటింతికిని వేడుక లీడేరుగాక
పెనగుచు బిగిసితే ప్రేమపుట్టునా
తనువున బూసిన గందము చల్లనౌగాక
వనములో తరువులు వడదీర్చవోపునా // అలుక //

చరణం:

సేవచేసే మగువకు చేతలెల్ళా జెల్లుగాక
యీవల నొడ్డారించితే నింపు వుట్టునా
శ్రీ వేంకటేశుడిందు విచ్చేసి తానిన్నుగూడెను
పూవులు పిందెలౌగక పొల్లు వెలవెట్టునా // అలుక //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం