సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అలవటపత్రశాయివైన రూప
పల్లవి:

అలవటపత్రశాయివైన రూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా // పల్లవి //

చరణం:

పడతులిద్దరిమీద బాదములు చాచుకొని
వొడికపురాజసాన నొత్తగిలి
కడలేనిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుగా గంటివిదె గోవిందరాజా // అలవటపత్రశాయివైన //

చరణం:

సిరులసొమ్ములతోడ శేషునిపై బవళించి
సొరిది దాసుల గృప జూచుకొంటాను
పరగుదైత్యులమీద పామువిషములే నీవు
కురియించితివా గోవిందరాజా // అలవటపత్రశాయివైన //

చరణం:

శంకుజక్రములతోడ జాచినకరముతోడ
అంకెల శిరసుకిందిహస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా // అలవటపత్రశాయివైన //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం