సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అమరాంగనలదె నాడేరు
పల్లవి:

అమరాంగనలదె నాడేరు
ప్రమదంబున నదె పాడేరు // పల్లవి //

చరణం:

గరుడ వాహనుడు కనక రథముపై
ఇరువుగ వీధుల నేగినీ
సురులును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు // అమరాంగనలదె //

చరణం:

ఇలధరు డదివో ఇంద్రరథముపై
కెలయచు దిక్కులు గెలిచేని
బలు శేషాదులు బ్రహ్మ శివాదులు
చెలగి సేవలటు చేసేరు // అమరాంగనలదె //

చరణం:

అలమేల్మంగతో నటు శ్రీ వేంకట
నిలయుడు రథమున నెగడీని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మిగులగడు బొగడేరు // అమరాంగనలదె //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం