సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు
పల్లవి:

అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు
కందువ మతంగగిరికాడిహనుమంతుఁడు

చరణం:

కనకకుండలాలతో కౌపీనముతోడ
జనియించినాఁడు యీహనుమంతుఁడు
ఘనప్రతాపముతోడ కఠినహస్తాలతోడ
పెనుతోఁక యెత్తినాఁడు పెద్దహనుమంతుఁడు ||

చరణం:

తివిరి జలధిదాఁటి దీపించి లంకయెల్లా
అవలయివల సేసె హనుమంతుఁడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మోచె దొడ్డహనుమంతుఁడు ||

చరణం:

తిరమైనమహిమతో దివ్యతేజముతోడ
అరసి దాసులఁ గాచీ హనుమంతుఁడు
పరగ శ్రీవేంకటేశుబంటై సేవింపుచు
వరములిచ్చీఁ బొడవాటిహనుమంతుఁడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం