సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అందరుమాలినయట్టిఅధములాల
టైటిల్: అందరుమాలినయట్టిఅధములాల
పల్లవి:
అందరుమాలినయట్టిఅధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
కనక మిత్తడితోడ కలయ సరిచూచితే
అనువవునా అది దోష మవుగాక
ఘనుడైనహరితో గడుహీనదేవతల
ననిచి సరివెట్టితే నయ మవునా భువిని // అందరుమాలిన //
పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై
వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱిలేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా // అందరుమాలిన //
కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలెకాక
అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను
కొంచపుదైవాల పలువంచలనేకాక // అందరుమాలిన //
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం