సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అందుకే నాపై దయ దలఁచు
టైటిల్: అందుకే నాపై దయ దలఁచు
పల్లవి:
అందుకే నాపై దయ దలఁచు మాతురబంధుఁడవు
యిందరిలో నా దైన్య మేమని చెప్పే నిఁకను
నేరము వచ్చినచోట నీ మొగమే చూతుఁ గాని
యేరీతిఁ బరిహరింప నే నోపను
తీరని పాపము లంటితే నారాయణ యందుఁ గాని
పేరుకొని యది విడిపించుకొన నెఱుఁగ
పరులు నాపయిఁ గనిసితే భావింతుఁగాని నిన్నే
బిరుద నే నై మలసి తప్పించుకో లేను
సరి నాపదైతే నీకే శరణంబు చొత్తుఁగాని
వొరులకుఁ జెప్పియట్టే వొడ్డించుకోఁజాలను
కడుఁ జింతైతే నీవు గలవని వుందుఁ గాని
దిడముగా నా బుద్ధి తిప్పఁగ లేను
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగపతి
బడివాయకుందుగాని బయపడనేనికను