సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
పల్లవి:

అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము // పల్లవి //

చరణం:

కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు // అంగ //

చరణం:

సతికి నీమెడ రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర // అంగ //

చరణం:

నెమ్మి నలమేల్‌మంగ నీకాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భాగ్యము // అంగ //

అర్థాలు



వివరణ