సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అంగనకు విరహమే సింగారమాయ
పల్లవి:

అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా

చరణం:

కలికి నిన్నుఁ దలఁచి గక్కున లోలోఁ గరఁగి
జలజలఁ జెమరించి జలకమాడె
బలుతమకాన నీకుఁ బక్కన నెదురువచ్చి
నిలువునఁ గొప్పువీడి నీలిచీర గప్పెను

చరణం:

సుదతి నిన్నుఁ జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాఁకాఁ బూసె గందము
మదనమంత్రములైనమాటల మర్మము సోఁకి
ముదురుఁబులకలను ముత్యాలు గట్టెను

చరణం:

గక్కనఁ గాఁగిట నిన్నుఁ గలసి యీమానిని
చొక్కి చంద్రాభరణపుసొమ్ములు వెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలఁబాలు వోసెను

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం