సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అంజనీదేవికొడుకు హనుమంతుఁడు
పల్లవి:

అంజనీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు

చరణం:

కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోనలందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు

చరణం:

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధఁ బ్రతాపించి వడిఁ దోకఁ గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు

చరణం:

వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం