సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిసింగారాలు నీకె అమరుఁగాక
పల్లవి:

అన్నిసింగారాలు నీకె అమరుఁగాక
యన్నిటా దేవతలు నిన్నందుకే మెచ్చేరు

చరణం:

చందురునివంటిమోము జలజాలే కన్నులట
యిందిర నీకే తగు నీ కొత్తలు
గొంది నొకటొకటికిఁ గూడవందు రివి నీకు
పొందై పాలవెల్లి తోడఁబుట్లే కావా

చరణం:

ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట
ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు
అక్కున వరలక్ష్మివి హరి వసంతమాధవుఁ
డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా

చరణం:

ధర నడుము సింహము తగు గజగమనాలు
తిరమై శ్రీవేంకటేశుదేవి నీకే పో
నరసింహుఁడై యుండి కరిఁగాచినట్టివాని-
సురత మందితిగాన చుట్టమువేకావా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం