సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటా నీపెంపు వింత హనుమంత
టైటిల్: అన్నిటా నీపెంపు వింత హనుమంత
పల్లవి:
అన్నిటా నీపెంపు వింత హనుమంత నీ-
వున్నచోటు నిశ్చింత మోహనుమంతా
రామునిసేనలఁ గాచి రావణుగర్వ మడఁచి
ఆముకొన్న బలవంత హనుమంతా
గోమున జలధి దాఁటి కొండతో సంజీవి దెచ్చి
ధీమంతుఁడవైతి వింత దివ్యహనుమంత
చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోఁచె
అక్కజపునీరూ పంత హనుమంత
చొక్కమై మీ రుండఁగాను సుగ్రీవాదులకెల్లా
అక్కర లే దించుకంతా హనుమంతా
జంగచాఁచి చేయెత్తి సరిఁ బిడికిలించుక
అంగము నిక్కించి తెంత హనుమంత
రంగగుశ్రీవేంకటాద్రిరాముని దేవి కిచ్చితి-
వంగులియ్యక మొక్కంత హనుమంతా