సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
టైటిల్: అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
పల్లవి:
అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలగ మెంఉకో మాపౌజు // పల్లవి //
జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపుకామక్రోధాలవర్గములారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌజు // అన్నిటికి //
తప్పని గుణాలు మూడు తనువికారములారు
అప్పటి మనోబుద్ద్యహంకారాలు
వుప్పతిల్లువిషయము లుడివోని వొకాయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌజు // అన్నిటికి //
ఆకలి దప్పియును మానావమానములును
సోకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు
మూకగమికాడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేకటారగడసేవా నెంచుకో మాపౌజు // అన్నిటికి //
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం