సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అన్నివిభవముల అతడితడు
పల్లవి:

అన్నివిభవముల అతడితడు
కన్నులువేవేలు గలఘనుడు // పల్లవి //

చరణం:

వేదాంత కోటులవిభుడు ఇతడు
నాదబ్రహ్మపు నడుమితడు
ఆదియంత్యముల కరుదితడు
దేవుడు సరసిజ నాభుడు ఇతడు // అన్నివిభవముల //

చరణం:

భవములణచు యదుపతి యితడు
భువనము లన్నిటికి పొడ వితడు
దివికి దివమైన తిరమితదు
పవనసుతు నేలిన పతి యితడు // అన్నివిభవముల //

చరణం:

గరుడుని మీదటి ఘనుడితడు
సిరు లందరి కిచ్చే చెలు వితడు
తిరు వేంకట నగము దేవు డితడు
పరమ పదమునకు ప్రభు వితడు // అన్నివిభవముల //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం