సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అనంత మద్భుత మాశ్చర్యం
పల్లవి:

అనంత మద్భుత మాశ్చర్యం బిది
సనాతనుఁడ నను సరవిఁ గావవే

చరణం:

బలిమి నసురలకు భయంకరుఁడవు
అలరి యమరులకు నానందకరుఁడవు
తలకొని ఋషులకు తపఃఫలదుఁడవు
పలు నీ మహిమలు పలుకఁగ వశమా

చరణం:

అరయ వేదముల కాధారంబవు
పరగఁగ జీవుల ప్రాణనాథుఁడవు
పరమయోగులకు పరబ్రహ్మమవు
తిరముగ నీమూర్తి దెలియఁగ వశమా

చరణం:

జగముల కెల్లను సర్వబంధుఁడవు
తగిలిన శ్రీకాంతకు నివాసమవు
జిగి శ్రీవైష్ణవులకు శ్రీవేంకటపతివి
తగు నీ కత లివి తలఁచఁగ వశమా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం