సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అంతా నీకు లోనే అనిరుద్ధా
పల్లవి:

అంతా నీకు లోనే అనిరుద్ధా మన
యంతరంగ మొక్క టాయె ననిరుద్ధా

చరణం:

అడ్డమాడఁ జాలము నీ కనిరుద్ధా
అడ్డెఁ డమ్మీనాఁడుఁ బోడి యనిరుద్ధా
అడ్డివెట్ట నింక నేల యనిరుద్ధా
అడ్డాఁక లెంచకుమీ యనిరుద్ధా

చరణం:

అప్పటి వేఁడుకొనేవా అనిరుద్ధ నీకు
నప్పణ నే నిచ్చేనా యనిరుద్ధా
అప్పుడే విన్నవించనా అనిరుద్ధ వొద్ద
నప్పసమై వున్నదాన ననిరుద్ధా

చరణం:

ఆయ మెఱుఁగుదువోయి అనిరుద్ధా
ఆయెడను డి వచ్చితి వనిరుద్ధా
ఆయిత్తమై కూడితివి అనిరుద్ధా
ఆయనాయ శ్రీవేంకట యనిరుద్ధా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం