సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అంతరంగములో నున్న హరియే గతి
పల్లవి:

అంతరంగములో నున్నహరియే గతిగాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును

చరణం:

పుట్టించినకర్మమే పోషించకుండునట
బెట్టుగా మనసే మఱిపించునట
పట్టైనమేనే ఆసల బతిమాలింపించునట
చుట్టములెవ్వరు యెంచిచూచినఁ బ్రాణికిని

చరణం:

పక్కన విత్తినభూమి పంట పండకుండునట
యెక్కడా మాయే భ్రమయింపించునట
అక్కరతోఁ జేసినపుణ్యమే కట్టివేసునట
దిక్కు దెస యెవ్వరు యీదేహిఁ గరుణించను

చరణం:

ఆసలఁబెట్టేపాయమే అటమటమౌనట
సేసేసంసారమే జ్ఞానిఁ జేయునట
వేసరక యింతకూ శ్రీవేంకటేశుఁ డేలికట
మోసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం