సంకీర్తన
రచయిత:
టైటిల్: అప్పడు మజ్జనమాడీనంగన
టైటిల్: అప్పడు మజ్జనమాడీనంగన
పల్లవి:
అప్పడు మజ్జనమాడీనంగన గూడి
కుప్పలు దెప్పలుగాఁ గుమ్మరించరో
బంగారుకొప్పెరల పన్నీరు నించి
రంగైన పచ్చకప్పురపు ధూళొత్తి
చెంగట గస్తూరిధూళి చికిలి గావించి
పొంగారుఁదట్టుపుణుఁగు పోయరో గిన్నెలను
పటికంపు గాఁగుల పరిమళాలెల్లా
ఘటియించి కుంకుమతో గడు మేదించి
అటునిటు గొజ్జంగనీరందంద నించి
కుటిలకుంతలులు పైఁగుమ్మరించరో
బలుపింగాణుల గదంబము గంధమును
కలపము గావించి గంబూరముతో
వెలయ మజ్జనమాడీ వేంకటాద్రివిభుఁడు
చెలగి యింతులు చేరి సేస చల్లరో