సంకీర్తన
రచయిత: తాళ్ళపాక చిన్నతిరుమాలాచార్య
టైటిల్: అప్పనివరప్రసాది అన్నమయ్యా
టైటిల్: అప్పనివరప్రసాది అన్నమయ్యా
పల్లవి:
అప్పనివరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకె కలఁ డన్నమయ్యా
అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా
బిరుదుటెక్కెములుగా బెక్కు సంకీర్తనములు
హరిమీఁద విన్నవించె నన్నమయ్యా
విరివిగలిగినట్టి వేదముల యర్థ మెల్లా
అరసి తెలిపినాఁడు అన్నమయ్యా
అందమైన రామానుజాచార్యమతమున
అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
విందువలె మాకును శ్రీవేంకటనాథుని నిచ్చె
అందరిలోఁ దాళ్ళపాక అన్నమయ్యా