సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అరసినన్ను
పల్లవి:

అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు

చరణం:

వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరను

చరణం:

అందరికి ప్రాణమైన ఆతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవుడికి శరణు
అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు

చరణం:

తానే చైతన్యమైన దైవానకు శరణు
నానా బ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రి యందునుండి వరములు
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం