సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అతడే రక్షకు డందరికతడే
టైటిల్: అతడే రక్షకు డందరికతడే
పల్లవి:
అతడే రక్షకు డందరి కతఁడే
పతి యుండగ భయపడ జోటేది
అనంతకరము లనంతాయుధము
లనంతుడు ధరించెలరఁగను
కనుఁగొని శరణాగతులకు మనకును
పనివడి యిఁక భయపడఁజోటేది
ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుఁడై యలరఁగను
నరహరికరుణే నమ్మినవారికి
పరఁదున నిఁక భయపడఁజోటేది
శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
నావల నీవల నలరఁగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపఁగ భయపడఁజోటేది