సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అవధారు రఘుపతి అందరిని
పల్లవి:

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
ఇవలనుండే కొలువిదెనదె సముఖాన // పల్లవి //

చరణం:

రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కు రంభాదులాడేరు
మోమెత్తి కవులెల్ల మ్రొక్కేరదివో // అవధారు //

చరణం:

ఇనవంశకుల జాత ఇక్ష్వాకుకుల తిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనకలక్ష్మణుడు సేవించె వింజామర // అవధారు //

చరణం:

కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజనము చెప్పరాదు రామ // అవధారు //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం