సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అవధరించఁగదవయ్య అన్నిరసములు నీవు
పల్లవి:

అవధరించఁగదవయ్య అన్నిరసములు నీవు
తివురుచునబ్బెనిదె తేనెమోవిరసము // పల్లవి //

చరణం:

చెలియచక్కఁదనాన శృంగారరసము
వెలయ బొమజంకెనల వీరరసము
కలయు రతికాంక్షలను కరుణారసము
అలరు మైపులకలను అద్భుతరసము // అవ //

చరణం:

తరుణిసరసములను తగుహాస్యరసము
పరుషంపువిరహాన భయరసము
బెరయు నిబ్బరములను భీభత్సరసము
గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము // అవ //

చరణం:

వనితఆనందముల వడిశాంతరసము
ననుపుమంతనములను నవరసంబులు
యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి
దినదినవినోదాల తిరమాయ రసము // అవ //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం