సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అవియే పో నేడు
పల్లవి:

అవియే పో నేడు మాతోనంటి సేసే తపములు
వివరించుకొని ఇట్టె విచ్చేయి మనవే ||

చరణం:

కొండల కొట్టగొనల గోరమైన తపములు
పండు బలములలోని పచ్చిమేతలు
గుండె దాకే మంత్రాల కుత్తికలో జసములు
దొండకారుణ్యాన నాడు తాజేసెగా ||

చరణం:

యేరులలో మునకలు యెఖ్ఖువ ఆచారాలు
ఆ రీతి మోనము తోడి యానందాలు
కోరికోరి చలివేడి కోటికోటి నేమాలు
చేరి యీ రీతి దపాలు సేసినాడుగా ||

చరణం:

సమ్మతించ జేసిన యాసన భేదబంధాలు
వుమ్మడి యన్యోన్యపు యోగాలు
దొమ్మి శ్రీ వేంకటపతి తొల్లి సేసె నట్లనె
రమ్మని నేడును నారతి జేసెగా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం