సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అవతారమందె నిదె అద్దమరేతిరికాడ
పల్లవి:

అవతారమందె నిదె అద్దమరేతిరికాడ
భవహరుఁడు శ్రావణబహుళాష్టమిని // పల్లవి //

చరణం:

వసుదేవుఁడు సేసిన పరతపముఫలము
పసల దేవకిపాలి భాగ్యరేఖ
దెసల సజ్జనులకు తిరమైన పుణ్యము
కొసరికె కంసుని గుండెదిగులు // అవ //

చరణం:

నందగోపుని యెదుటి నమ్మిన యైశ్వర్యము
కందువ యశోదకు కనకనిధి
ముందరి గొల్లెతలకు మోహపుఁ బాలజలధి
సందడి శిశుపాలునిసంహారము // అవ //

చరణం:

దేవతలమునులకు దివ్యమైన పరంజ్యోతి
భావించుదాసుల వజ్రపంజరము
శ్రీవేంకటాద్రిమీఁదఁ జెలఁగే కృష్ణుఁ డిదివో
దావతి నరకాసురు తలగుండుగండఁడు // అవ //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం