సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అవునయ్య నీ సుద్దు
టైటిల్: అవునయ్య నీ సుద్దు
పల్లవి:
అవునయ్య నీ సుద్దు లటు వంటివి
జవళితో నంటు బచ్చలి వంటి వాడవు // పల్లవి //
చెలరేగి యేడ లేని చేతలెల్లా జేసివచ్చి
వెలయు నిప్పుడు నన్ను వేడుకొనేవు
పలుమారు నీచేత బాసలు గొన వెరతు
కలువ కంటుల యెడ కాత రీడ వనుచు // అవునయ్య //
వాడ వారిపై నెల్లా వలపుల చల్లి వచ్చి
యీడ నాతో నెడలేని యిచ్చలాడేవు
కోడె కాడ నీ వోజ కొనియాడ నిచ్చితయ్యీ
జాడతో నింతుల యెడ చంచలుడ వనుచు// అవునయ్య //
పెక్కు గోపికల నెల్లా బెండ్లాడి యిట వచ్చి
గక్కన నా కౌగిట గలసితివి
నిక్కి శ్రీ వేంకటేశుడ నే నలమేల్మంగను
కక్కసించ నోప నీవు గబ్బి వాడవనుచు // అవునయ్య //
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం